News October 1, 2024

వరంగల్ నుంచి ఉప్పల్‌కు ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగ సందర్భంగా వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో ఈనెల 12 వరకు ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశామని వరంగల్ రీజియన్ RM డి.విజయభాను తెలిపారు. ప్రయాణికులకు రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. (HNK 125, JN 120, WGL 1 నుంచి 125, WGL 2 డిపో 125, MHBD 47, NSPT 119, PKL 93, TRR 48, BHPL 48) మొత్తం 850 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 20, 2025

వరంగల్: ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తనిఖీల కోసం చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనుమతి లేని ఇసుక రవాణాపై కేసులు నమోదు చేసి, వాహనాలను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. విజిలెన్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 20, 2025

వరంగల్ కలెక్టర్‌ను అభినందించిన ఎమ్మెల్యే రేవూరి

image

దక్షిణ భారతదేశంలో జల సంరక్షణ కేటగిరీ-2లో తొలి స్థానం సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అభినందించారు. డిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ అవార్డు, రూ. కోటి బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చిన కలెక్టర్ ను ప్రశంసించారు.

News November 20, 2025

వరంగల్: ‘స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి’

image

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులకు ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో సర్పంచ్ ఎన్నికల ఏర్పాట్లు, రిజర్వేషన్లు, ఓటరు జాబితాలపై ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్య రాణి తదితరులు పాల్గొన్నారు.