News October 1, 2024
వరంగల్ నుంచి ఉప్పల్‌కు ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో ఈనెల 12 వరకు ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశామని వరంగల్ రీజియన్ RM డి.విజయభాను తెలిపారు. ప్రయాణికులకు రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. (HNK 125, JN 120, WGL 1 నుంచి 125, WGL 2 డిపో 125, MHBD 47, NSPT 119, PKL 93, TRR 48, BHPL 48) మొత్తం 850 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 9, 2024
వరంగల్: రేపటి నుంచి ఎనుమాముల మార్కెట్‌కు సెలవులు
వరంగల్ నగరంలోని ఎనుమాముల మార్కెట్‌కు రేపటి నుంచి నాలుగు రోజులు వరుసగా సెలవులు ప్రకటిస్తున్నామని మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పి. నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. రేపు దుర్గాష్టమి, ఎల్లుండి మహార్నవమి, 12న విజయదశమి, 13న ఆదివారం సందర్భంగా మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. కాబట్టి రైతులు మార్కెట్‌కు రాకూడదని పేర్కొన్నారు. ఈనెల 14న మార్కెట్ పునః ప్రారంభమవుతుందని తెలిపారు.
News October 9, 2024
BHPL: 12వ తేదీన రావణసుర వధ కార్యక్రమం
గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12వ తేదీన రాత్రి 8 గంటలకు రావణాసుర వాద కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు యూత్ అధ్యక్షుడు ఆవుల రాజు తెలిపారు. మండలంలో తొలిసారిగా రావణ వధ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాజు పిలుపునిచ్చారు.
News October 9, 2024
వరంగల్ మార్కెట్లో పత్తి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పాత పత్తి ధర నిన్నటి లాగే తటస్థంగా ఉంది. మంగళవారం క్వింటా పాత పత్తి రూ.7,450 ధర పలకగా.. నేడు కూడా రూ.7450 పలికినట్లు అధికారులు తెలిపారు. అలాగే కొత్తపత్తి ధర నిన్న రూ.6,960 పలకగా.. నేడు రూ.6,930కి తగ్గినట్లు పేర్కొన్నారు. కాగా, నేడు మార్కెట్‌కు పత్తి తరలివచ్చింది.