News November 5, 2024
వరంగల్ నుంచి పుష్ పుల్ రైలు
పుష్‌పుల్ (07463) రైలును రెండేళ్ల తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్ వరకు పొడిగించారు. గతంలో ఈ రైలు వరంగల్- సికింద్రాబాద్ మధ్య మధ్యాహ్న సమయంలో నడిచేది. అయితే మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా 2 సం.ల నుంచి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. దీంతో వరంగల్ నుంచి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు.. తాజాగా పుష్‌పుల్ రైలును వరంగల్‌కు పొడిగించారు.
Similar News
News December 3, 2024
దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అంతా చేయూత నివ్వాలని పిలుపునిచ్చారు. విభిన్న ప్రతిభావంతులు ఏ రంగంలో ఉన్నా వారిని ప్రోత్సహించాలని కోరారు. అంగవైకల్యంతో కుమిలిపోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రప్రభుత్వం దివ్యాంగులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.
News December 3, 2024
విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న HNK NPDCL కార్యాలయం
హనుమకొండలోని NPDCL కార్యాలయాన్ని సోమవారం విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా ఈనెల 1 నుంచి 9 వరకు జరిగే ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించామని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో విద్యుత్ కాంతులు అటుగా వెళ్లే వాహనదారులను ఆకర్షించాయి.
News December 2, 2024
సిద్దేశ్వరుడికి భక్షాలతో మహా నివేదన
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్ధేశ్వరాలయంలో మార్గశిర మాసం సోమవారం పోలీ స్వర్గం సందర్భంగా సిద్ధేశ్వరుడికి భక్షాలతో మహా నివేదన, ప్రత్యేక అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిద్దేశ్వరాలయానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని పలు ఆలయాల్లో నేడు భక్తుల సందడి నెలకొంది.