News February 11, 2025

వరంగల్ నుంచి విద్యార్థులతో ట్రైన్లో చెన్నై వెళ్లనున్న రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్‌కు అకస్మికంగా రానున్న విషయం తెలిసిందే. HNKలోని సుప్రభా హోటల్‌లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. విద్యార్థులతో కలిసి ఢిల్లీ నుంచి వస్తున్న ఆయన.. రాత్రి 7:30కు WGL నుంచి చెన్నైకు రైలులో వెళ్లనున్నారు. సాయంత్రం హెలికాప్టర్ ద్వారా హన్మకొండకు చేరుకొని ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్య నేతలతో సమావేశం అవుతారని పార్టీ నేతలు తెలిపారు.

Similar News

News December 4, 2025

ఈ అలవాట్లతో సంతోషం, ఆరోగ్యం!

image

చిన్న చిన్న అలవాట్లే మంచి ఆరోగ్యం, సంతోషానికి కారణమవుతాయని న్యూరాలజిస్ట్ సుధీర్ కుమార్ చెబుతున్నారు. ఉదయాన్నే సూర్యకాంతిలో ఉండటం, రోజువారీ నడక, మంచి నిద్ర, శ్రద్ధతో తినడం, మిమ్మల్ని కేర్ చేసే వారితో మాట్లాడటం, 2 నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్, దయతో వ్యవహరించాలని తెలిపారు. రాత్రి వేళల్లో స్క్రీన్ చూడటం తగ్గించడం, హైడ్రేటేడ్‌గా ఉండటం, రోజూ కొత్తవి నేర్చుకోవడం అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.

News December 4, 2025

HYD సీపీ ఎమోషనల్ పోస్ట్

image

డబ్బు మత్తులో.. బంధాలు ఛిద్రం అవుతున్నాయని నగర సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగులో రూ.4 కోట్లకు బీమా చేయించి అన్నను తమ్ముడు ఘోరంగా హతమార్చాడు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దీనిపై సజ్జనార్ స్పందించారు. ‘ఏ బ్యాంక్ బ్యాలెన్స్ గుండె చప్పుడును కొనలేదు. ఏ బీమా పాలసీ పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేదు’ అని పేర్కొన్నారు.

News December 4, 2025

తిరుపతి SVUలో ఇంత దారుణమా..?

image

తిరుపతి SVU పరిధిలో 1991 నుంచి 2015 వరకు డిగ్రీ చదివిన వాళ్లు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవడానికి గతేడాది ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక్కో పేపర్‌కు రూ.2వేలు, 3పేపర్లకు మించితే రూ.4వేలు చొప్పున ఫీజు కట్టించుకున్నారు. ఇప్పటి వరకు పరీక్షల షెడ్యూల్ ఇవ్వలేదు. డబ్బులు కట్టి సంవత్సరం దాటుతున్నా పరీక్షల తేదీ వెల్లడించకపోవడంతో SVUలో ఇంత దారుణమా? అని అందరూ విమర్శిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.