News March 7, 2025

వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌గా సన్ ప్రీత్ సింగ్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన సీపీగా సన్ ప్రీత్ సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సీపీ గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓఎస్‌డీగా పనిచేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న అంబర్ కిషోర్ ఝాను రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా నియమించారు.

Similar News

News March 26, 2025

నల్లబెల్లి: మిషన్ భగీరథ పంప్ హౌస్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

నారక్కపేట గ్రామ పరిధిలోని మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పంప్ హౌస్ ద్వారా ప్రజలకు తాగునీరు అందించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. పైప్ లీకేజ్ మరమత్తు పనులు త్వరగా చేపట్టాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, మండల తహశీల్దార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

News March 26, 2025

WGL: WOW సూపర్ ఐడియా.. సమ్మర్ స్పెషల్ ఆటో  

image

మహబూబాబాద్ జిల్లాలో ఎండ వేడిని తట్టుకోవడానికి ఓ ఆటో యజమాని వినూత్నంగా ప్రయత్నించాడు. తన ఆటోలో పచ్చని చెట్లను అమర్చి ప్రయాణికులను ఆకర్షిస్తున్నాడు. ఇది చూసిన ప్రయాణికులు ఆ ఆటోను ఎక్కడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. పచ్చని చెట్లు లేకపోవడం వలనే ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అందరూ చెట్లను పెంచాలని ఆటోడ్రైవర్ ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాడు.  

News March 26, 2025

KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

error: Content is protected !!