News March 7, 2025

వరంగల్ నూతన పోలీస్ కమిషనర్‌గా సన్ ప్రీత్ సింగ్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన సీపీగా సన్ ప్రీత్ సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సీపీ గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓఎస్‌డీగా పనిచేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న అంబర్ కిషోర్ ఝాను రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్‌గా నియమించారు.

Similar News

News January 23, 2026

HYDలో ఇక ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్!

image

సిటీలో ప్రాపర్టీ వెరిఫికేషన్ ఇకపై డిజిటల్ మయం కానుంది. పన్ను వసూళ్లలో పారదర్శకత కోసం బల్దియా సరికొత్త ‘సెంట్రలైజ్డ్ జియోస్పేషియల్ ప్లాట్‌ఫామ్’ను సిద్ధం చేసింది. ఫీల్డ్ స్టాఫ్ మొబైల్ యాప్ ద్వారా QR కోడ్ స్కాన్ చేయగానే ఆస్తి వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఈ 3ఏళ్ల ప్రాజెక్టు కోసం 70:30 రేషియోలో టెక్నికల్ బిడ్డింగ్ నిర్వహించాలని GHMC కమిషనర్ కర్ణన్ నిర్ణయించారు. దీంతో పన్నుల ఆడిటింగ్ సులభతరం కానుంది.

గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలన

image

పుట్టపర్తి పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ప్రజలు, వీఐపీలకు ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. వివిధ శాఖల శకటాలు, స్టాళ్ల ఏర్పాటులో అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని వసతులు కల్పించాలన్నారు.