News August 20, 2024

వరంగల్: నృత్య కళాశాలలో ప్రవేశాలకు 30 వరకు గడువు

image

విద్యారణ్య ప్రభుత్వ సంగీతా నృత్య కళాశాలలో పలు విభాగాల్లో సర్టిఫికెట్ డిప్లొమో కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుధీర్ కుమార్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కూచిపూడి నృత్యం, సితార్, పేరిణి నృత్యం పలు విభాగాల్లో ప్రవేశాల కోసం ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

Similar News

News September 15, 2024

నిమజ్జనం సందర్భంగా వరంగల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

image

గణపతి నిమజ్జనం సందర్భంగా వరంగల్ ట్రైసిటీస్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. ఈ ఆంక్షలు సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. ఖమ్మం, ములుగు, నర్సంపేట, హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఆంక్షలు తప్పక పాటించాలని తెలిపారు.

News September 15, 2024

వరంగల్: రేపే నిమజ్జనం.. జర భద్రం

image

గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగిస్తుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం గణనాథుడి నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. గ్రేటర్ పరిధిలోని పద్మాక్షి గుండం, బంధం చెరువు, చిన్న వడ్డేపల్లి, ఉర్సు, కోట, బెస్తం చెరువు, ఇతర ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరి మీ గణేశుడి నిమజ్జనం ఎప్పుడు? కామెంట్ చేయండి.

News September 15, 2024

వరంగల్: నిమజ్జనం కోసం చెరువులో పూడిక తీసివేత

image

వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో చెరువుల్లో గణేశ్ నిమజ్జనం కోసం పూడికతీత పనులను చేపట్టారు. గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో భారీ జేసీబీలతో హసన్పర్తి, కాజీపేట బంధం చెరువు, ములుగు రోడ్డులోని కోట చెరువు, దేశాయిపేట, గొర్రెకుంట, చిన్న వడ్డేపల్లి, ఖలా వరంగల్ గుండు చెరువు, రంగ సముద్రం రంగశాయిపేట బెస్తం చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలు, గుర్రపు డెక్కను తొలగించారు.