News May 25, 2024
వరంగల్: నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునేందుకు 3 రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుని ప్రచారం చేశాయి. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రేమేందర్ రెడ్డి, రాకేశ్ రెడ్డిలు వరంగల్ జిల్లాకు చెందిన వారే కాగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న నల్గొండ జిల్లాకు చెందిన వారు. 27వ తేదీన జరిగే ఎన్నికల్లో వరంగల్ గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కడతారో చూడాల్సి ఉంది.
Similar News
News February 9, 2025
వరంగల్: సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

సోమవారం జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పరిపాలన పరమైన కారణాల దృష్ట్యా రద్దు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారులు కార్యాలయానికి రావద్దని ఆమె కోరారు.
News February 9, 2025
మినీ మేడారం జాతర మరో మూడు రోజులే!

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ జాతరకు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు జంపన్న వాగు వద్ద స్నానాలు ఆచరించడానికి షవర్లు, తాగునీటి సదుపాయం, పార్కింగ్ స్థలాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. బుధవారం నుంచి శనివారం వరకు మినీ జాతర జరగనుంది.
News February 8, 2025
నిబంధనలు పాటిస్తేనే అనుమతులు: కమిషనర్

నిబంధనలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. వరంగల్ హనుమకొండ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాలన్నారు. హంటర్ రోడ్డు, యూనివర్సిటీ, శ్రీ సాయి నగర్, వరంగల్, ఆరెపల్లి ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి కొలతలు వేసి పరిశీలించారు. భవన నిర్మాణాలు చెప్పటానికి టీజీ బిపాస్ ద్వారా అనుమతుల జారీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.