News May 11, 2024
వరంగల్: నేటి సాయంత్రంతో మూగబోనున్న మైకులు

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇవాళ సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఇన్ని రోజులుగా పాటలతో, మాటలతో హోరెత్తిన మైకులు మూగబోనున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు మరో 48 గంటల సమయమే మిగిలి ఉండటంతో, అటు మద్యం దుకాణాలు సైతం ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మూతపడనున్నాయి. ప్రచార పర్వం ముగుస్తుండటంతో అటు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పర్వం మొదలు కానుంది.
Similar News
News February 15, 2025
దుగ్గొండి: ‘ఈజీఎస్ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు’

జాతీయ గ్రామీణ ఉపాధి పనుల్లో పారదర్శకత లోపిస్తే చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో కౌసల్యాదేవి తెలిపారు. దుగ్గొండిలో ఉపాధి హామీ 2023-24 వార్షిక సంవత్సరంలో చేపట్టిన పనులపై మండల స్థాయి సామాజిక ప్రజా వేదికను శుక్రవారం నిర్వహించారు. గ్రామాల వారీగా చేపట్టిన పనులపై ఈజీఎస్, పంచాయతీ అధికారులు సభలో చదివి వినిపించారు. ఎంపీడీవో అరుంధతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News February 15, 2025
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
News February 14, 2025
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి సహకరించాలి: కలెక్టర్

వరంగల్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి రైతులు తమ భూములు అందించి సహకరించాలని కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గ్రీన్ ఫిల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి భూ సేకరణ కోసం సంగెం గ్రామానికి చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశాభివృద్ధికి రహదారులు చాలా అవసరమని తద్వారా జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు.