News March 20, 2025

వరంగల్: నేడు జాబ్ మేళా దరఖాస్తుల ఆహ్వానం..

image

ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.మల్లయ్య తెలిపారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో ఉదయం 11.00 గంటలకు జాబ్ మేళాకు హాజరు కావాలని మరిన్ని వివరాలకు 9848895937 నంబర్లు సంప్రదించాలని కోరారు. 

Similar News

News December 5, 2025

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: రాణి కుముదిని

image

సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.

News December 4, 2025

వరంగల్: రిజర్వ్ స్టాఫ్‌తో ర్యాండమైజేషన్

image

జీపీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ను జిల్లా పరిశీలకులు బాల మాయాదేవి, కలెక్టర్ సత్య శారదలు కలెక్టరేట్ వీసీ హాల్‌లో నిర్వహించారు. వరంగల్, నర్సంపేట డివిజన్ల మండలాల వారీగా సర్పంచ్, వార్డు స్థానాలకు ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోల కేటాయింపులు పూర్తయ్యాయి. స్థానికేతర సిబ్బందిని ప్రాధాన్యంగా ఎంపిక చేస్తూ, 91 పంచాయతీలకు 20% రిజర్వ్ స్టాఫ్‌తో ర్యాండమైజేషన్ జరిపారు.