News March 19, 2025

వరంగల్: పకడ్బందిగా పదవ తరగతి పరీక్షలు

image

ఈనెల 21 నుండి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహణపై సమీక్షించారు. ఉ.9:30 నుంచి 12:30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. దీనికోసం 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు ఫ్లయింగ్ స్కార్డ్స్ 49 మంది శాఖ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 24, 2025

వరంగల్ కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ రద్దు

image

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.

News November 22, 2025

వరంగల్‌లో ముగ్గురు సీఐల బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్‌స్పెక్టర్)- వీఆర్‌కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్‌కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్‌స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.