News February 16, 2025

వరంగల్: పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

image

పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి ఆదేశించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పరీక్షలను సజావుగా నిర్వహించాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 9,237 మంది విద్యార్థులు హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు.

Similar News

News October 27, 2025

డీసీసీ పీఠం పర్వతగిరికి దక్కేనా..?

image

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం పర్వతగిరికి దక్కుతుందా? అని శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక ప్రక్రియను అధిష్ఠానం ప్రారంభించిన నేపథ్యంలో పర్వతగిరి మండలం నుంచి ఇరువురు వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏనుగల్లు గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ కన్వీనర్ బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు ఉన్నారు.

News October 26, 2025

సోమవారం ‘ప్రజావాణి’ రద్దు: వరంగల్ కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం(అక్టోబర్‌ 27) నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని పరిపాలనాపరమైన కారణాల వల్ల రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని ఆమె సూచించారు.

News October 26, 2025

భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: WGL కలెక్టర్

image

భూభారతికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో వర్ధన్నపేట, దుగ్గొండి మండలాల భూభారతి, పీఓటీ రికార్డులపై ఆమె సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ను వేగవంతం చేయాలని, దరఖాస్తులను తిరస్కరించే పక్షంలో అందుకు స్పష్టమైన కారణాలను తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.