News January 31, 2025

వరంగల్: పచ్చి పల్లికాయ క్వింటా ధర రూ.5,510

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం పల్లికాయలు తరలివచ్చాయి. ఈ క్రమంలో క్వింటా సూక పల్లికాయ రూ.6,200 ధర పలకగా.. పచ్చి పల్లికాయ రూ.5,510, ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా రేపు, ఎల్లుండి మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు రానున్న నేపథ్యంలో ఈరోజు మార్కెట్‌కు పలురకాల సరుకులను రైతులు తీసుకొని వచ్చారు.

Similar News

News November 20, 2025

వేములవాడ: యువకుడి మృతి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

image

వేములవాడ డ్రైనేజీలో పడి<<18336834>> ఓ యువకుడు మృతి <<>>చెందిన ఘటనా స్థలాన్ని వేములవాడ పట్టణ పోలీసులు పరిశీలించారు. స్థానిక రెండో బైపాస్ రోడ్డులోని బతుకమ్మ తెప్ప సమీపంలోని డ్రైనేజీలో బుధవారం అర్ధరాత్రి తరువాత ద్విచక్రవాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిని స్థానిక ఉప్పుగడ్డ వీధికి చెందిన గోవిందు అభినవ్(25)గా గుర్తించారు.

News November 20, 2025

HYD: 3వేల మంది అతిథులు.. 2,500 మంది పోలీసులు

image

వచ్చేనెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోని కందుకూర్ మీర్ఖాన్‌పేటలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించనున్నారు. ఈ సమ్మిట్‌కు దాదాపు 3వేల మంది వీఐపీలు, వారి అసిస్టెంట్లు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు వెయ్యి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక 2,500 మంది పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు.

News November 20, 2025

ఈ ఉద్యమమే టెక్ శంకర్‌ను మావోయిస్టుగా మార్చింది

image

మావోయిస్ట్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో స్వగ్రామం వజ్రపుకొత్తూరు(M)బాతుపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1988లోని పీపుల్స్ ఉద్యమంతో మావోయిస్టుల పార్టీలో చేరి 1995 DEC 1న ఒంగోలు మాజీ MP సుబ్బరామిరెడ్డిపై కాల్పుల కేసులో శంకర్‌ది కీలక పాత్రని సమాచారం. బాతుపురంలో స్తూపం ఆవిష్కరణకు గద్దర్‌ రాకతో రాష్ట్రంలో ఈయన పేరు మార్మోగింది.