News January 31, 2025
వరంగల్: పచ్చి పల్లికాయ క్వింటా ధర రూ.5,510

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం పల్లికాయలు తరలివచ్చాయి. ఈ క్రమంలో క్వింటా సూక పల్లికాయ రూ.6,200 ధర పలకగా.. పచ్చి పల్లికాయ రూ.5,510, ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. కాగా రేపు, ఎల్లుండి మార్కెట్‌కు రెండు రోజులు సెలవులు రానున్న నేపథ్యంలో ఈరోజు మార్కెట్‌కు పలురకాల సరుకులను రైతులు తీసుకొని వచ్చారు.
Similar News
News February 13, 2025
హుస్సేన్ సాగర్ స్కైవాక్‌కు లైన్ క్లియర్

HYDలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కై వాక్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే HMDA ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) విధానంలో నిర్మాణం చేపట్టాలని యోచిస్తోంది. హుస్సేన్ సాగర్ చరిత్రను దృష్టిలో పెట్టుకొని నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. స్కైవాక్‌తో పాటు సైకిల్ ట్రాక్‌ను కూడా ఇక్కడ నిర్మించనున్నారు.
News February 13, 2025
వరంగల్: తగ్గిన మక్కల ధర.. పల్లికాయ ధరలు ఇలా!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కల ధర మళ్లీ తగ్గింది. మంగళవారం రూ.2,370 పలికిన మక్కలు(బిల్టీ) ధర బుధవారం మరింత తగ్గి రూ.2,355కి చేరింది. ఈరోజు మరింత తగ్గి రూ.2,350కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే.. క్వింటా సూక పల్లికాయ ధర రూ.6,410 పలకగా.. పచ్చి పల్లికాయ రూ.4,900 పలికిందని పేర్కొన్నారు.
News February 13, 2025
వైట్‌హౌస్‌లో పిల్లలతో అధ్యక్షులు

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన ‘వైట్‌హౌస్’కు ఎలాన్ మస్క్ తన చిన్న కుమారుడిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎంతో ప్రతిష్ఠాత్మక ప్రదేశంలో కొన్నేళ్లుగా అధ్యక్షులు, అధికారుల పిల్లలు సందడి చేయడం కామన్ అయిపోయింది. 2009లో ఒబామా ఇద్దరు కూతుళ్లతో, 1994లో బిల్ క్లింటన్ కూతురు చెల్సీ, 1978లో జిమ్మీ కార్టర్ తన కూతురు అమీతో, 1963లో కెనడీ తన కొడుకుతో కలిసి వైట్‌హౌస్‌లో సందడిగా గడిపారు.