News May 20, 2024

వరంగల్: పట్టు దక్కేది ఎవరికో..

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మసమాజ్ పార్టీ, కొంత మంది స్వతంత్రులు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవరివైపు మొగ్గు చూపుతారో…

Similar News

News December 2, 2024

ములుగు: నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు

image

నేటి నుంచి మావోయిస్టు PLGA వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2- 8వ తేదీ వరకు వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భూపాలపల్లి జిల్లా కొయ్యూరు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లో అప్పటి అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్, ఎర్రంరెడ్డి సంతోశ్ రెడ్డి మృత్యువాత పడ్డారు. వారి గుర్తుగా వారోత్సవాలు నిర్వహిస్తారు. కాగా, ఏజెన్సీలో హై అలర్ట్ నెలకొంది.

News December 1, 2024

నెక్కొండ: విఫలమైన ఆన్‌లైన్ ప్రేమ.. యువకుడు సూసైడ్

image

ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెక్కొండ మండలంలో జరిగింది. అప్పలరావుపేటకి చెందిన వినయ్ (25) HYDలో ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతనికి ఆన్‌లైన్‌లో యువతి పరిచయం కాగా..అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. దీంతో యువకుడు 5రోజుల క్రితం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

News December 1, 2024

ములుగు: ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ ఏజెన్సీ

image

ములుగు జిల్లా చల్పాక అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏటూరునాగారం మండలానికి సమీప అడవుల్లోనే జరగడం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులు తెలంగాణలోకి తలదాచుకునేందుకు వచ్చారా? లేక రేపటి నుంచి జరగనున్న వారోత్సవాల కోసం తమ ఉనికి చాటుకునేందుకు వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.