News September 25, 2024
వరంగల్: పతనమవుతున్న మొక్కజొన్న ధరలు!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం రూ.2,590 పలికిన మక్కలు (బిల్టీ) నేడు రూ.2,575కి చేరింది. గత వారం ఊహించని స్థాయిలో రికార్డు ధర పలికిన మక్కలు క్రమంగా పతనమవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News October 25, 2025
టెన్త్ పరీక్షల ఫీజు నవంబర్ 13లోపు చెల్లించాలి: డీఈవో

వరంగల్ జిల్లాలోని పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు ఈనెల 30 నుంచి నవంబర్ 13లోపు చెల్లించాలని డీఈవో రంగయ్య నాయుడు తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో నవంబర్ 15 నుంచి 29 వరకు చెల్లించాలని పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ ఉన్న సబ్జెక్టులకు రూ.125, వొకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
News October 24, 2025
గుర్తింపు ఫీజు, హరిత నిధి చెల్లించాలి: డీఐఈఓ

జిల్లాలోని ప్రభుత్వ రంగ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు గుర్తింపు ఫీజు చెల్లించాలని DIEO శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్లో సంబంధిత కాలేజ్ లాగిన్ ద్వారా “రికగ్నైజేషన్ ఫీజు” తప్పక చెల్లించాలని, విద్యార్థుల పూర్తి వివరాలను “ఆన్ లైన్ చెక్ లిస్టు”లతో సరి చూసుకోవాలని DIEO సూచించారు.
News October 24, 2025
కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలి: MP కావ్య

జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగం, ప్రాజెక్టుల పురోగతిపై వరంగల్ కలెక్టర్ సత్యశారదదేవితో ఎంపీ డాక్టర్ కడియం కావ్య సమావేశం అయ్యారు. వరంగల్ జిల్లా అభివృద్ధి వేగం మరింత పెంచడానికి కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను వెంటనే క్లియర్ చేసి ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలన్నారు.


