News September 25, 2024
వరంగల్: పతనమవుతున్న మొక్కజొన్న ధరలు!
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం రూ.2,590 పలికిన మక్కలు (బిల్టీ) నేడు రూ.2,575కి చేరింది. గత వారం ఊహించని స్థాయిలో రికార్డు ధర పలికిన మక్కలు క్రమంగా పతనమవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ధరలు పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News October 7, 2024
వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర
2 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభమైంది. గత వారంతో పోలిస్తే నేడు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. గత వారంలో క్వింటా పత్తి రూ.7,450 పలకగా నేడు రూ.7550 అయినట్లు అధికారులు తెలిపారు. అయితే ఆశించిన స్థాయిలో ధర రాకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.
News October 7, 2024
వరంగల్: గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ సందడి!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. వరంగల్ జిల్లాలో 325, హనుమకొండ- 208, మహబూబాబాద్-461, జనగామ-283, ములుగు -174, భూపాలపల్లి – 240 గ్రామ పంచాయతీలున్నాయి.
News October 7, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్..
> MHBD: దక్షిణాఫ్రికాలో మెరిసిన జిల్లా అమ్మాయి
> MLG: ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి
> WGL: కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు
> JN: ఒకే ఇంటిలో ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు
> HNK: జిల్లాలో ఘనంగా దాండియా వేడుకలు
> BHPL: పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది: MLA
> HNK: వృద్ధులను చిన్న పిల్లల్లా చూసుకోవాలి: ఎంపీ