News March 21, 2024
వరంగల్: పత్తి క్వింటా ధర రూ.7,315
హమాలీ గుమస్తాల సంఘం విజ్ఞప్తి మేరకు వరంగల్ ఎనుమాముల మార్కెట్ బుధవారం బంద్ ఉండగా ఈరోజు ప్రారంభమైంది. నేడు మార్కెట్కు పత్తి తరలి రాగా.. ధర మొన్నటి కంటే రూ.15 పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,300 పలకగా.. ఈరోజు రూ.7,315 పలికింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
Similar News
News January 8, 2025
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి: వర్ధన్నపేట ఎమ్మెల్యే
కాకతీయుల కాలం నాటి ఐనవోలు మల్లికార్జున స్వామి వారి ఆలయం ప్రాశస్త్యం కలిగిందని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ రవీందర్ రావు అన్నారు. మంగళవారం ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై అన్ని శాఖల అధికారులతో ఆలయ ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
News January 7, 2025
ములుగు అడవుల్లోనే కెమెరాకు చిక్కిన పులి
వెంకటాపురం సమీప అడవుల్లో నెల రోజుల క్రితం పెద్దపులి సంచరించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సుమారు నెలరోజుల పాటు వివిధ జిల్లాల అటవీ ప్రాంతంలో పులి సంచారం కొనసాగించింది. జనవరి 1న ములుగు జిల్లాలోని లింగాల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు అమర్చిన ట్రాప్ కెమెరాకు పులి సంచారం చిక్కింది. మళ్లీ అవే ట్రాప్ కెమెరాలకు మరోసారి పెద్దపులి సంచారం కనిపించింది. దీంతో జిల్లాలోనే పులి ఉన్నట్లు తెలుస్తోంది.
News January 7, 2025
వరంగల్లో ఎక్కువ, ములుగు జిల్లాలో తక్కువ
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 30,43,540 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. అయితే మగవారితో పోలిస్తే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. HNK(D) 5,08,618, WGL(D) 7,73,453, జనగామ(D) 7,62,106, MHBD(D) 4,85,692, BHPL(D) 2,78,185, ములుగు(D) 2,35,486 మంది ఓటర్లు ఉన్నారు. WGL జిల్లాలో ఎక్కువ, ములుగులో తక్కువ మంది ఓటర్లు ఉన్నారు.