News March 21, 2024
వరంగల్: పత్తి క్వింటా ధర రూ.7,315
హమాలీ గుమస్తాల సంఘం విజ్ఞప్తి మేరకు వరంగల్ ఎనుమాముల మార్కెట్ బుధవారం బంద్ ఉండగా ఈరోజు ప్రారంభమైంది. నేడు మార్కెట్‌కు పత్తి తరలి రాగా.. ధర మొన్నటి కంటే రూ.15 పెరిగింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,300 పలకగా.. ఈరోజు రూ.7,315 పలికింది. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
Similar News
News September 12, 2024
మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీ
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల MLAలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ MP కడియం కావ్య సంతాపం వ్యక్తం చేశారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ మాజీ సభ్యుడిగా సీతారాం ప్రజల పక్షాన పోరాడిన గొప్ప నాయకుడని ఎంపీ వివరించారు. ఏచూరి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని వారు చెప్పారు.
News September 12, 2024
మైనింగ్ కార్పొరేషన్ అధికారులతో హుస్సేన్ నాయక్ సమావేశం
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ఈరోజు ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఒడిస్సా రాజధాని భువనేశ్వర్‌లో ఆయన మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో సమావేశమయ్యారు. షెడ్యూల్డ్ తెగల సమస్యలపై సమావేశం నిర్వహించి, పలు కీలక విషయాల గురించి చర్చించారు. ఆయనకు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
News September 12, 2024
ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎంల)ను భద్రపరిచిన గోదాములను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను కలెక్టర్ పరిశీలించారు.