News April 10, 2024
వరంగల్: పత్తి ధర క్వింటాకి రూ.7260

ఐదు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పున:ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కి పత్తి తరలిరాగా.. కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. అయితే పత్తి ధర మాత్రం గత వారంతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా తగ్గింది. నేడు క్వింటా పత్తి ధర రూ.7260 పలికింది.
Similar News
News March 15, 2025
సంగెం: రోడ్డు ప్రమాదం.. మేస్త్రీ మృతి

సంగెం మండలం తిమ్మాపురం సబ్ <<15757117>>స్టేషన్ <<>>వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. ప్రకాశం (D) జిగురుమల్లికి చెందిన బంగారు బాబు(34) కుటుంబంతో సంగెం(M)కి వలస వచ్చాడు. మేస్త్రీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పని కోసం వెళ్తున్న బాబు, మణికంఠ బైక్‌ను బొలెరో ఢీకొట్టింది. చికిత్స కోసం 108లో తరలిస్తుండగా మార్గమధ్యలో బాబు మృతిచెందాడు. కేసు నమోదైంది.
News March 15, 2025
వరంగల్: నేటీ నుంచి అంగన్వాడీలకు ఒంటిపూట

రాష్ట్రంలో ఎండలు మండుతున్న వేల అంగన్వాడీ కేంద్రాలలో ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల తరహాలోనే శనివారం నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నడపాలని మంత్రి సూచించారు.
News March 14, 2025
వరంగల్: హోలీ వేడుకల్లో కలెక్టర్ శారద

టీఎన్జీవో నాయకుల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ వేడుకలలో కలెక్టర్ కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని సూచించారు.