News February 28, 2025
వరంగల్: పదవీ విరమణ పొందిన పోలీసులకు సన్మానం

వరంగల్ జిల్లా కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘంగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాలువాతో సన్మానం చేసి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీ సేవలు నేటితరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవి సురేశ్ కుమార్, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 1, 2025
వరంగల్కు ఎయిర్పోర్టు.. రివ్వున ఎగరనున్న విమానాలు

మామునూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓరుగల్లు ప్రజల ఏళ్లనాటి ఆకాంక్ష నెరవేరబోతోంది. ఇప్పటికే 696 ఎకరాల భూమిని సేకరించగా.. మరో 253 ఎకరాల భూమిని గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి సేకరిస్తున్నారు. దీనికోసం రూ.205 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విమానాలు నడిపేందుకు ఇప్పుడున్న 1.8 కి.మీ రన్వేను 3.9కి.మీలకు పెంచాల్సి ఉంది. మీ కామెంట్
News March 1, 2025
వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

మార్చ్ 5వ తేదీ నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం జనరల్ 4,967, ఒకేషనల్ 848 మొత్తం 4,815 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ 5,739, ఒకేషనల్ 767 మంది మొత్తం 6,506 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News March 1, 2025
వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: వరంగల్ డీఐఈవో

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించడానికి పరీక్షా కేంద్రాల సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు. మార్చి 5నుంచి నిర్వహించబోయే ఇంటర్ వార్షిక పరీక్షలపై శుక్రవారం లాల్ బహదూర్ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు సమావేశం నిర్వహించారు.