News June 10, 2024
వరంగల్: పదోతరగతి విద్యార్థికి CM చేతుల మీదుగా అవార్డు
ఏటూరునాగారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 10/10 GPA సాధించిన విద్యార్థి శ్రీరామ్ బిందు సాయిలత నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకోనుంది. ములుగు జిల్లా నుంచి వందేమాతరం ప్రతిభా పురస్కారానికి ఎంపికై, నేడు ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననుంది. దీంతో మండల ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 30, 2024
WGL: పదేళ్లలో BRS అప్పులు చేసి భారం మోపింది: సీతక్క
గత BRSప్రభుత్వం అప్పులు చేసి భారం మోపిందని, అయినా సరే రైతుల సంక్షేమం కోసం రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశామని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు మహబూబ్‌నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డ అయిన CMరేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నారని, రైతుల సంక్షేమానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. BRSనేతలు రైతులను రెచ్చగొడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
News November 30, 2024
వరంగల్: ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించే అవకాశం పోలీసులకు మాత్రమే: సీపీ
తొమ్మిది నెలలు శిక్షణను పూర్తిచేసుకుని విధులు నిర్వహించేందుకు సిద్ధమైన 578 మంది కానిస్టేబుళ్లతో సీపీ అంబర్ కిషోర్ ఝా శనివారం సమావేశం నిర్వహించారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే అవకాశం పోలీసులకు మాత్రమే ఉంటుందన్నారు. ప్రజల మన్ననలు పొందేవిధంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.
News November 30, 2024
టీజీపీఎస్సీ నూతన ఛైర్మన్‌గా జనగామ వాసి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా జనగామ మండలం ఓబుల్ కేశ్వపూర్ గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. డిసెంబర్ 3న ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ మేరకు వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.