News April 15, 2025
వరంగల్: పలు జిల్లాలకు వర్ష సూచన

మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామతో పాటు వరంగల్లోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం, రాత్రి వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్రమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది.
Similar News
News October 21, 2025
నర్సింగ్ కళాశాల పనులు వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి

ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టర్ అనుదీప్తో కలిసి ఆయన పనులను పరిశీలించారు. ₹25 కోట్లతో కళాశాల బ్లాక్ (G+2), హాస్టల్ (G+3) నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. మిగిలిన సానిటరీ, వాల్ పుట్టి పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
News October 21, 2025
ఆజాద్ హింద్ స్ఫూర్తితో వరంగల్లో స్వాతంత్ర్య జ్వాలలు!

నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో 1943 OCT 21న ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఛలో దిల్లీ నినాదంతో స్వాతంత్ర్య సైన్యాన్ని నడిపించారు. ఆయన త్యాగం ప్రభావంతో ఉమ్మడి వరంగల్లో విద్యార్థులు, స్వయంసేవకులు స్వాతంత్ర్య నినాదాలతో ర్యాలీలు, జెండా ఆవిష్కరణలు నిర్వహించారు. భారత్ మాతాకిజై ఇన్క్విలాబ్ జిందాబాద్ వంటి నినాదాలతో వీధులు మారుమోగాయి. బోస్ ఆత్మస్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికీ ఉత్సాహాన్ని నింపింది.
News October 21, 2025
త్వరలో 6వేల పోలీసు ఉద్యోగాలకు పోస్టింగ్స్: మంత్రి

AP: పోలీసు అభ్యర్థులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. తమ ప్రభుత్వం 6వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిందని, వారికి త్వరలో పోస్టింగ్స్ ఇస్తామని వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో నియామకాలు జరగలేదని విమర్శించారు. మరోవైపు పోలీసు శాఖలో 11వేల ఖాళీలు ఉన్నాయని ఇదివరకే డీజీపీ ప్రకటించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.