News August 31, 2024

వరంగల్: పలు రైళ్ల రద్దు

image

WGL-హసన్‌పర్తి-కాజీపేట ‘F’ క్యాబిన్‌ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. గుంటూరు-సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ SEP 23- OCT 8, విజయవాడ-సికింద్రాబాద్‌ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ SEP 25 నుంచి OCT 7 వరకు రద్దయ్యాయి. సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్ SEP 23 నుంచి OCT 7 వరకు అంతరాయం కలగనుంది.

Similar News

News November 21, 2025

నర్సంపేట: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష

image

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న పట్టణంలోని అంగడి సెంటర్‌లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటో నడుపుతున్న పట్టణానికి చెందిన మేకల మహేందర్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు మహేందర్‌ను నర్సంపేట న్యాయస్థానంలో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.

News November 21, 2025

బడి బయటి పిల్లల సర్వేను క్షుణ్ణంగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

image

జిల్లాలో జరుగుతున్న బడి బయటి పిల్లల సర్వేను క్షుణ్ణంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు ఆదేశించారు. 6 నుంచి 14, 15 నుంచి 19 ఏళ్ల బడి బయటి పిల్లల వివరాలను ప్రబంధ్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఇటుక బట్టీలు, టెక్స్‌టైల్ పార్కుల్లో పనిచేసే కుటుంబాల పిల్లలకు పని ప్రదేశంలోనే పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News November 21, 2025

వరంగల్: గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి

image

వరంగల్ జిల్లాలోని గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎక్సైజ్, బీసీ వెల్ఫేర్ అధికారులను తెలంగాణ గౌడ సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏకాంతం గౌడ్, నేతలు మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా గీత కార్మికులకు రావాల్సిన ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, తాటి, ఈత చెట్లు ఎక్కే ప్రతి గీత కార్మికుడికి సభ్యత్వాలు వెంటనే జారీ చేయాలని కోరారు.