News August 31, 2024
వరంగల్: పలు రైళ్ల రద్దు

WGL-హసన్‌పర్తి-కాజీపేట ‘F’ క్యాబిన్ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ SEP 23- OCT 8, విజయవాడ-సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్‌ప్రెస్ SEP 25 నుంచి OCT 7 వరకు రద్దయ్యాయి. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ SEP 23 నుంచి OCT 7 వరకు అంతరాయం కలగనుంది.
Similar News
News February 8, 2025
వరంగల్: ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులతో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజలను అనారోగ్య సమస్యల నుంచి రక్షించాలని వైద్యశాఖ అధికారులను సూచించారు.
News February 8, 2025
మేడారానికి బస్సు ప్రారంభం

మినీ మేడారం జాతర సందర్భంగా భక్తులకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగే మినీ మేడారం జాతరకు హనుమకొండ నుంచి తాడ్వాయి మీదుగా ప్రతి రోజు 6 ట్రిప్పులు బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి సీతక్క చొరవతో మహా జాతరకు బస్సు సౌకర్యం ఉన్నట్లు మినీ జాతరకు కూడా బస్సులు ఏర్పాట్లు చేశారు.
News February 8, 2025
నర్సంపేట: గుప్త నిధుల కోసం తవ్వకాలు

నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల కలకలం రేపింది. గ్రామ శివారులో గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు చేస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక జేసీబీ , రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.