News July 2, 2024
వరంగల్: పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లుగా దరఖాస్తులు

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలల్లో హన్మకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులకు పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లుగా పనిచేయడానికి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రాంతీయ సమన్వయ అధికారి ఎన్.విద్యారాణి తెలిపారు. పీజీలో సంబంధిత సబ్జెక్టుతో పాటు బీఈడీ ఉన్న అభ్యర్థులు హన్మకొండలోని RCO ఆఫీస్‌లో ఈనెల 3లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 4న డెమో ఉంటుందన్నారు.
Similar News
News January 7, 2026
జిల్లాల పునర్విభజన: ఓరుగల్లులో మళ్లీ హాట్ టాపిక్!

జిల్లాల విభజన అంశం మళ్లీ తెరపైకి రావడంతో వరంగల్ వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. గత ప్రభుత్వం ఉమ్మడి వరంగల్‌ను 6 జిల్లాలుగా విభజించిందన్న విమర్శల నేపథ్యంలో, ప్రభుత్వం శాసనసభలో పునర్విభజన ప్రకటన చేయడం కొత్త చర్చకు దారితీసింది. వరంగల్-హనుమకొండ విలీనంపై స్పష్టత వస్తుందా? ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధులు ఎలా మారతాయి? అనే ఆసక్తి నెలకొంది. సరిహద్దులు మారకుండా చూసే అవకాశం ఉందో చూడాల్సి ఉంది.
News January 6, 2026
ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలించాలి: కలెక్టర్

నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలుంటే రాజకీయ పార్టీలు నిర్ణీత గడువులోగా తెలియజేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పట్టణాల పరిధిలో జాబితాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. పార్టీల ప్రతినిధులు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి మార్పులు, చేర్పులపై స్పందించాలన్నారు.
News January 6, 2026
పంట వ్యర్థాలను కాల్చొద్దు: వరంగల్ డీఏవో

ప్రత్తి పంటల కోత అనంతరం మిగిలే పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందడంతోపాటు భూసారం పెంచి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి కె.అనురాధ తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూమిలోని మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు నశించడమే కాకుండా గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు.


