News December 28, 2024
వరంగల్: పెద్ద పులుల సంచారంపై భయం భయం..!
వరంగల్ జిల్లాలో <<14996095>>పెద్ద పులుల సంచారం<<>>పై అటవీ సమీప గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులో పెద్దపులి అడుగుజాడ కనిపించడంతో అటవీ అధికారులు పరిశీలించారు. 2 పులులు సంచరిస్తున్నట్లు గుర్తించారు. దీంతో నల్లబెల్లికి సరిహద్దులుగా ఉన్న దుగ్గొండి, ఖానాపురం, నర్సంపేట మండలాల్లోని గ్రామాల్లో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News January 1, 2025
నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్కు సెలవు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు నేడు (బుధవారం) సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి గురువారం మార్కెట్ యథావిధిగా ప్రారంభమవుతుందన్నారు. రైతులు విషయాన్ని గమనించి నేడు సరుకులు తీసుకొని రావద్దని సూచించారు.
News December 31, 2024
కొమురవెల్లి మల్లన్న ఆదాయం రూ.16.50 లక్షలు
కొమురవెల్లి మల్లన్న కళ్యాణం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో సుమారు రూ.16.50 లక్షల మేరకు బుకింగ్ ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. తలనీలాల సమర్పణ, ఆర్జిత సేవలు, పట్నాలు, బోనాలు, ప్రత్యేక దర్శనాలు, వసతి గదుల అద్దె, ప్రసాద విక్రయాలు ఇతర ద్వారా ఆదివారం రూ. 13.40 లక్షలు, సోమవారం లక్ష రూపాయల బుకింగ్ ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
News December 31, 2024
సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుక జరుపుకుందాం: CP
నూతన సంవత్సర వేడుకలను సంతోషకర వాతావరణంలో జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. నూతన సంవత్సర వేడుకలు ఇతరులకు ఇబ్బంది కల్గించకుండా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, ప్రతి ప్రాంతంలో పోలీస్ గస్తీ ఉంటుందని, వాహనదారులు మద్యం సేవించి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిని జరిమానతో పాటు జైలుకు పంపిస్తామని CP హెచ్చరించారు.