News July 2, 2024

వరంగల్: పెరిగిన మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.18,500 పలికింది. అలాగే ఏసీ 341 రకం మిర్చి రూ.16,500, వండర్ హాట్(WH) మిర్చికి రూ.18,500 ధర వచ్చింది. కాగా తేజ మిర్చి నిన్నటితో పోలిస్తే రూ.500, 341 మిర్చి రూ.500 తగ్గాయి. వండర్ హాట్ మిర్చి నిన్న రూ.16,000 పలకగా రూ.2,500 పెరిగి 18,500 పలికింది.

Similar News

News November 29, 2024

ప్రజా పాలన వేడుకలను ఘనంగా నిర్వహించండి: కలెక్టర్ ప్రావీణ్య

image

ప్రజా పాలన విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. నేడు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న దృష్ట్యా డిసెంబర్ 3న మునిసిపాలిటీల్లో అర్బన్ డే వేడుకలను సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు చేశారు.

News November 29, 2024

శాంతి భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి: వరంగల్‌ సీపీ

image

శాంతి భద్రతల విషయంలో పోలీస్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా వుండాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా పోలీస్‌ అధికారులకు సూచించారు. కమిషనరేట్‌ కార్యాలయంలో శుక్రవారం నేర సమీక్ష నిర్వహించారు. సూదీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రధానంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు.

News November 29, 2024

వరంగల్: రాష్ట్ర స్థాయికి 28 ప్రాజెక్టుల ఎంపిక

image

రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌కు వరంగల్ జిల్లా నుంచి 28 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. నర్సంపేటలో మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌లో ఇన్‌స్పైర్ కేటగిరిలో 148, రాష్ట్రీయ బాల సైన్స్ కేటగిరిలో 352 ఎగ్జిబిట్లు వచ్చాయి. ఈ రెండు కేటగిరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 28 ప్రాజెక్టులను జడ్జీలు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. త్వరలో జరిగే స్టేట్ లెవల్ పోటీల్లో వాటిని ప్రదర్శించనున్నారు.