News February 19, 2025

వరంగల్: పెరిగిన మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి బుధవారం మొక్కజొన్న తరలి రాగా ధర భారీగా పెరిగింది. మంగళవారం మక్కలు(బిల్టీ)కి రూ.2,311 ధర రాగా నేడు రూ.2365 పలికిందని వ్యాపారులు తెలిపారు. ఒక రోజు వ్యవధిలోనే రూ.54 ధర పెరగడం రైతులకు కొంత ఉపశమనం కలిగించినట్టయింది. ధర మరింత పెరగాలని మొక్కజొన్న పండించిన రైతులు కోరుతున్నారు.

Similar News

News March 28, 2025

NLG: సంక్షోభంలో పౌల్ట్రీ రంగం 

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్‌ఫ్లూ.. పౌల్ట్రీ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఇప్పటికే కొన్ని రోజులుగా కోళ్లు మృతి చెందుతుండడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. బర్డ్‌ఫ్లూ కారణంగా 90 శాతం ప్రజలు చికెన్ తినడం మానేశారు. ఫలితంగా సదరు కోళ్ల కంపెనీ నిర్వాహకులు పౌల్ట్రీ రైతులకు కోడి పిల్లలు ఇవ్వడం పూర్తిగా మానేశారు. దీంతో వందలాది కోళ్ల ఫామ్ లకు తాళాలు పడ్డాయి.

News March 28, 2025

భార్యను చంపి.. సూట్‌కేసులో కుక్కి..

image

బెంగళూరులో ఘోరం జరిగింది. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య(32)ను హత్య చేశాడు. అనంతరం సూట్‌కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గాలించి పుణేలో పట్టుకున్నారు. తమ మధ్య గొడవల సమయంలో భార్య తరచూ చేయిచేసుకుంటోందన్న కోపంతోనే భర్త ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

News March 28, 2025

నేడు చెన్నైకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేడు చెన్నై వెళ్లనున్నారు. మద్రాస్ ఐఐటీలో జరగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమిట్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఏఐ, ఐఓటీ వంటి పలు అంశాలపై ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. తిరిగి సాయంత్రం సీఎం అమరావతికి చేరుకుంటారు.

error: Content is protected !!