News October 21, 2024
వరంగల్: పెరుగుతున్న మొక్కజొన్న ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. నేడు మక్కలు(బిల్టీ) క్వింటాకి రూ.2,545 పలికింది. గతవారం బుధవారం రూ.2,416 ధర, గురువారం రూ.2,420, శుక్రవారం రూ.2,470 ధర పలికాయి. పత్తిధరలు మళ్లీ పెరుగుతుండడంతో మొక్కజొన్న పండించిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 17, 2024
WGL: నిరుద్యోగులకు ఈనెల 20న జాబ్ మేళా
వరంగల్ జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి శనివారం తెలిపారు. హెచ్‌డిఎఫ్‌సిలో 50, ముత్తూట్ ఫిన్ కార్ప్‌లో 100, సర్వాగ్రామ్ ఫైనాన్స్‌లో 15 ఖాళీల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ వరంగల్ ఐటిఐ బాయ్స్ క్యాంపస్‌కు రావాలన్నారు.
News November 16, 2024
WGL: సీఎం పర్యటన పనులను పరిశీలించిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు
ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల కలెక్టర్లు ప్రావిణ్య, డాక్టర్ సత్య శారదా, దివాకర టీఎస్, రిజ్వాన్ బాషా షేక్, రాహుల్ శర్మ, GWMC అశ్విని తానాజీ వాకడే శనివారం పరిశీలించారు. సీఎం పర్యటన రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. పర్యటన కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
News November 16, 2024
హనుమకొండ జిల్లాలో చిరుత కలకలం!
హనుమకొండ జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. పరకాల మండలం రాజుపేట పంటపొలాల్లో చిరుత సంచరించినట్లు రైతులు అనుమానానిస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని పరిశోధిస్తున్నారు.