News February 12, 2026

వరంగల్: పేదల కడుపులు నింపిన ఎన్నికలు!

image

ఉమ్మడి వరంగల్‌లో అర్ధాకలితో జీవనం సాగిస్తున్న పేదల కడుపులు మున్సిపల్ ఎన్నికలు నింపాయి. ఓటర్లను మచ్చిక చేసుకునే దిశగా అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు విరివిగా పంపిణీ చేశారనే ప్రచారం సర్వత్రా వ్యాపించింది. ఈ నేపథ్యంలో రెక్కాడితే డొక్కాడని నిరు పేద కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఓటరుకు ఇంత అని చేతిలో డబ్బులు పెట్టడంతో మురిసిపోయారు. రెండుపూటలా తినొచ్చని సంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News March 13, 2026

నిర్మల్: ఈ నెల 16న ప్రజావాణి రద్దు

image

జనాభా గణన నేపథ్యంలో ఈ నెల 16న కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించబడడం లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి 18 వరకు తహశీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

News March 13, 2026

అనకాపల్లి: 124 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ సెకండ్‌ ఇయర్ పరీక్షకు 124 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు శుక్రవారం తెలిపారు. మొత్తం 8,888 మంది హాజరు కావలసి ఉండగా 8,764 మంది పరీక్ష రాసినట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరుగుతున్నట్లు తెలిపారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

News March 13, 2026

NZB: ముగ్గురికి వారం రోజుల జైలు శిక్ష

image

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి ఒక్కొక్కరికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ శుక్రవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. అలాగే 15 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ 1.50 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌ చేస్తూ పట్టుబడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.