News February 1, 2025

వరంగల్ పోలీసులకు పతకాలు

image

రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ పోలీసులు ఆర్చరీలో రికార్డు సృష్టించారు. ఈ క్రీడలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఏకంగా ఐదు పతకాలను సాధించారు. మూడు బంగారు పతకాలతో పాటు ఒక రజతం, ఒక కాంస్యం పతకాన్ని గెలుచుకున్నారు. ఎస్ఐ అనిల్ వేర్వేరు విభాగాల్లో మూడు బంగారు పతకాలు సాధించగా, ఎస్ఐ రాజేందర్, కానిస్టేబుల్ రాహుల్ ఒలింపిక్ విభాగంలో రజతం, కాంస్య పతకాలు సాధించారు.

Similar News

News July 11, 2025

KNR: 24 గంటల్లో దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

image

కరీంనగర్ మారుతి నగర్‌లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు నాగరాజు, సదాశివను అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సీఐ జాన్ రెడ్డి తెలిపారు. నిందితులు బంగారు గొలుసు అమ్మేందుకు వెళ్తుండగా చాకచక్యంగా అరెస్టు చేసి, నిందితుల వద్ద బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

News July 11, 2025

జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ కేంద్రం బృందాలు పర్యటన: కలెక్టర్

image

స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా జిల్లాలో ఉత్తమ గ్రామాలు ఎంపికలో భాగంగా కేంద్రం నుంచి అకాడమీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (AMS )బృందాలు జిల్లాలో పర్యటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లా అధికారులతో కేంద్ర ఏఎంఎస్ బృంద సభ్యులు ఏలూరులో కలెక్టర్‌ను కలిశారు. రోజుకు 2 గ్రామాల చొప్పున 36 గ్రామాలలో పర్యటిస్తారని తెలిపారు.

News July 11, 2025

KNR: RTC DMలతో RM సమీక్షా సమావేశం

image

KNR రీజియన్ పరిధిలోని డిప్యూటీ RMలు ఎస్. భూపతిరెడ్డి, పి.మల్లేశం, 11 మంది డిపో మేనేజర్లతో RM బి.రాజు KNR బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025-26 ఆర్థిక సం. ప్రథమ త్రైమాసికంలో రీజియన్ లోని అన్ని డిపోల పనితీరు పై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఎల్లవేళలా తగినన్ని బస్సులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.