News April 7, 2025
వరంగల్: ప్రతిభ కనబరిచిన మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు

ఏవీవీ కళాశాలలో జరిగిన తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అఫీషియల్ అటెంప్ట్‌లో వరంగల్ నగరానికి చెందిన మణి మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ కోచ్ మణికంఠ గడదాసుతో పాటు పలువురు అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారు. నేడు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ విచ్చేసి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు.
Similar News
News April 21, 2025
ప్రొడ్యూసర్ నన్ను అసభ్యంగా పిలిచాడు: విద్యాబాలన్

బాలీవుడ్ నటి విద్యాబాలన్ గతంలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఓ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. నా దగ్గరకు వచ్చి అసభ్యంగా పిలిచాడు. ఆ అవమానం తర్వాత 6 నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు. ఈ మాటలు నాపై నాకున్న నమ్మకాన్ని నాశనం చేశాయి. సినిమా కోసం బరువు పెరిగితే బాడీ షేమింగ్ చేసేవారు. నా కెరీర్‌లో ఇలాంటివి చాలానే ఉన్నాయి’ అని తెలిపారు.
News April 21, 2025
నెల్లూరు కలెక్టరేట్‌లో ఉచిత భోజనం

నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే) సోమవారం జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అర్జీలు ఇవ్వడానికి వచ్చారు. వీరికి కలెక్టర్ ఓ.ఆనంద్ ఉచితంగా భోజనం ఏర్పాటు చేశారు. తీవ్రమైన ఎండలతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
News April 21, 2025
చెట్లకు చికిత్స అందిస్తున్నారు!

ఏంటి ఆశ్చర్యపోతున్నారా? మనుషులకు, జంతువులకు డాక్టర్లు ఉండటం చూశాం. కానీ, చెట్ల ఆరోగ్యం కోసం పంజాబ్‌కు చెందిన IRS అధికారి రోహిత్ మిశ్రా పాటుపడుతున్నారు. ఆయన ప్రపంచంలోనే మొదటి ట్రీ క్లినిక్‌ను స్థాపించగా దీనికి ప్రత్యేకమైన అంబులెన్స్ కూడా ఉంది. ఇందులోని రకరకాల ఆయుర్వేదిక్, ఆర్గానిక్ మందులు మొక్కలకు వచ్చే సమస్యలకు చెక్ పెడతాయని తెలిపారు. అడవిలోని వేలాది మొక్కలకు ఆయన పునర్జన్మనిచ్చారు.