News February 5, 2025
వరంగల్: ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతర విద్యుత్: కలెక్టర్

రాబోయే వేసవిలో ప్రభుత్వ ఆసుపత్రులలో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో ఎన్పీడీసీఎల్, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించారు.
Similar News
News March 11, 2026
కాకతీయ యూనివర్సిటీకి CPGET-2026 నిర్వహణ బాధ్యతలు

రాష్ట్రంలో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక CPGET-2026 పరీక్షల నిర్వహణ బాధ్యతలు వరంగల్‌లోని కేయూకు దక్కాయి. గత కొన్నేళ్లుగా ఈ పరీక్షలను హైదరాబాద్ OU నిర్వహిస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేసి బాధ్యతలను కేయూకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించనున్నారు.
News March 11, 2026
MP అర్వింద్ ఆతిథ్యం అద్భుతం: నారా లోకేశ్

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆతిథ్యం అద్భుతమని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఓ సమ్మిట్ కోస ఢిల్లీ వెళ్లిన లోకేశ్‌ను అర్వింద్ తన ఇంటికి ఆహ్వానించారు. “అద్భుతమైన భోజనం, అంతకు మించిన మంచి స్నేహంతో గడిపిన సమయం చిరస్మరణీయం. మీ ఆత్మీయత నిజంగా స్ఫూర్తిదాయకం, మీ అభిమానిగా మారిపోయాను” అంటూ విందులో పాల్గొన్న లోకేశ్ తన సంతోషాన్ని పంచుకున్నారు.
News March 11, 2026
వరంగల్: బార్లలో ‘తక్కువ’కే మద్యం!

వరంగల్ నగరంలోని మద్యం విక్రయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా వైన్ షాపుల కంటే బార్లలో ధరలు అధికంగా ఉండాలి. కానీ, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి తలకిందులైంది. లైసెన్సు ఫీజుల భారం, పెరిగిన లిక్కర్ మార్టుల పోటీతో బార్లలో గిరాకీ తగ్గింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు బార్ల యజమానులు వైన్ షాపుల కంటే తక్కువ ధరలకే మద్యాన్ని విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామం నగరంలో చర్చనీయాంశంగా మారింది.


