News February 27, 2025

వరంగల్: బాలాజీనగర్లో గోమాతకు శ్రీమంతం

image

గోమాతకు శ్రీమంతం నిర్వహించిన ఘటన వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ఎనుమాముల రోడ్డులోని బాలాజీ నగర్‌లో బుధవారం జరిగింది. శ్రీకైలాస ఈశ్వర ప్రభక్త ఆంజనేయస్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోమాతకు శ్రీమంతం పూజా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని గోశాలలో ఉన్న వకలా మాత గోవు గర్భం దాల్చగా ఆలయ భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News

News February 27, 2025

భద్రకాళి చెరువులో రుద్రమదేవి.. AI PHOTO

image

సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, ఇతర చారిత్రాత్మక కట్టడాలకు సంబంధించిన ఏఐ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రకాళి చెరువు మధ్యలో రాణి రుద్రమ దేవి విగ్రహం, చుట్టూ కోట కనిపించేలా జనరేట్ చేసిన ఓ ఏఐ ఫొటో ప్రస్తుతం ఓరుగల్లు ప్రజలను ఆకట్టుకుంటోంది. అది చూసిన వారంతా చెరువులో రుద్రమదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

News February 27, 2025

శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో గురువారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

News February 27, 2025

వరంగల్: విద్యార్థిని ఆత్మహత్య.. UPDATE

image

WGL నగరంలో ఉరేసుకొని బుధవారం <<15587387>>విద్యార్థిని ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన రేష్మిత WGL ములుగు రోడ్డులోని వ్యవసాయ విద్యాలయంలో ఫస్టియర్ చదువుతోంది. విద్యార్థినికి ఇంటిపై బెంగ ఉండటంతో అప్పుడప్పుడు తల్లి ఆమెతో పాటు హాస్టల్‌లో ఉండేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. కాగా, నిన్న శివరాత్రి కావడంతో తోటి విద్యార్థులు సొంతూరు వెల్లగా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

error: Content is protected !!