News February 4, 2025
వరంగల్: బాలికపై అత్యాచారం.. పోలీసులకు ఫిర్యాదు

వరంగల్ నగరంలో దారుణం జరిగింది. ఓ బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. వరంగల్ డివిజన్లో ఇంటర్ చదువుతున్న బాలిక(16)పై యువకుడు అత్యాచారం చేయడంతో ఏడు నెలల గర్భవతి అయింది. దీంతో బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News November 25, 2025
MHBD: రుణాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి సంక్షేమం కోసం స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ, ఇందిర మహిళ చీరల పంపిణీ MHBD పట్టణంలో నిర్వహించారు. అనంతరం వడ్డీ లేని రుణాలు రూ.2.70 కోట్ల చెక్కులను పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు.
News November 25, 2025
పిల్లలు నూడుల్స్, పాస్తా తింటే కలిగే నష్టాలు తెలుసా?

రిఫైన్డ్ ఫ్లోర్తో తయారు చేసే నూడుల్స్, పాస్తా తింటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. వీటిలో ఉండే అధిక సోడియంతో పిల్లల్లో బీపీ, గుండె, కిడ్నీ సమస్యలు వస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగి డయాబెటిస్, హై కొలెస్ట్రాల్కు దారితీస్తుంది. ప్రొటీన్స్, విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉండడంతో ఒబెసిటీ, పోషకాహార లోపం ఏర్పడుతుంది. జీర్ణక్రియ సమస్యలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
News November 25, 2025
కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహలు కలకలం

కృష్ణానది సీతమ్మవారి పాదాల సమీపంలో మంగళవారం ఇద్దరి మృతదేహలు కలకలం సృష్టించాయి. సుమరు 40 సంవత్సరాల వ్యక్తి, 12 సంవత్సరాల బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నీళ్లలో నుంచి బయటికి తీసి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి పంపించామని పోలీసులు తెలిపారు. బ్యారేజ్ ర్యాంప్ సమీపంలో మృతదేహాలను గుర్తించామని, దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.


