News February 4, 2025

వరంగల్: బాలికపై అత్యాచారం.. పోలీసులకు ఫిర్యాదు

image

వరంగల్ నగరంలో దారుణం జరిగింది. ఓ బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. వరంగల్ డివిజన్‌లో ఇంటర్ చదువుతున్న బాలిక(16)పై యువకుడు అత్యాచారం చేయడంతో ఏడు నెలల గర్భవతి అయింది. దీంతో బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Similar News

News September 18, 2025

కొత్తగూడెం- భద్రాచలం మధ్య ఎయిర్‌పోర్టుకు స్థలాలు..?

image

కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి చుంచుపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో స్థలాలను గుర్తించినా సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈసారి భద్రాచలం- కొత్తగూడెం మధ్య ఉన్న స్థలాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఫీజుబులిటీ సర్వేకు ప్రభుత్వం ఇక్కడే స్థలాలను చూపించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రెండు, మూడుచోట్ల స్థలాలను గుర్తించగా, వాటిలోఒకటి ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.

News September 18, 2025

HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్‌సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.

News September 18, 2025

APPLY NOW: ఇస్రో‌లో ఉద్యోగాలు

image

<>ఇస్రో<<>>లో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు గుడ్‌‌న్యూస్. ఇస్రో అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్‌ 7 అసిస్టెంట్(రాజ్యభాష) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.