News April 11, 2024
వరంగల్: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు

వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ ఆధ్వర్యంలో నేడు ఐనవోలు మండలం కక్కిరాలపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, వన్నాల శ్రీరాములుతో కలిసి బీజేపీలో చేరారు. వీరికి అరూరి రమేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 1, 2026
WGL: సానుకూల ఆలోచనలతో ముందుకు సాగాలి: కలెక్టర్

వరంగల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ డాక్టర్ సత్య శారద న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, శాంతి సమృద్ధి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేవలం వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాకుండా, సమాజ శ్రేయస్సును కూడా ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ప్రతి పౌరుడు కృషి చేయాలని, సానుకూల ఆలోచనలు విజయానికి తొలిమెట్టు అని ఆమె ఉద్ఘాటించారు.
News December 31, 2025
మెరుగైన వైద్య సేవల కోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్: WGL కలెక్టర్

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా లోపాల దిద్దులుబాటకు 90 రోజుల యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్‌వో, ఎంజీఎం, సీకేఎం, ఆర్ఈహెచ్, నర్సంపేట, వర్ధన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు సంబంధించిన అధికారులతో బుధవారం సమీక్షించారు. వైద్య ఉద్యోగులకు ఫేస్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలన్నారు. హాస్పిటల్స్ సూపర్డెంట్లు, అధికారులు పాల్గొన్నారు.
News December 30, 2025
వరంగల్: ఇక మునిసిపల్ పోరుపై రాజకీయం..!

రెండు నెలలు గ్రామ పంచాయతీ ఎన్నికల చుట్టు తిరిగిన రాజకీయాలు.. ఇప్పుడు పట్టణ పోరుపై తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. దీంతో ఆయా పట్టణాల్లో కౌన్సిల్ స్థానాల ఆశావహులు, నాయకుల మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులు వార్డుల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.


