News March 27, 2025
వరంగల్ : బైకును ఢీ కొట్టిన లారీ.. బాలుడు మృతి

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బైకుపై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గవిచర్లకి చెందిన గాలి చందు (17) బైక్‌పై ఆశాలపల్లి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కంటైనర్ లారీ ఢీకొట్టడంతో చందు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 3, 2025
ఘోరం.. ఆనవాళ్లు లేకుండా మారిన బస్సు

రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ ఢీకొట్టి మీద పడటంతో <<18183932>>బస్సు<<>> పూర్తిగా ధ్వంసమైంది. ముఖ్యంగా కుడివైపు ఉండే భాగం ఆనవాళ్లు లేకుండా అయింది. దీంతో ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. టన్నుల కొద్దీ బరువు ఉండే కంకర మీద పడటంతో ప్రయాణికులు దాని కింద సమాధి అయిపోయారు. జేసీబీల సాయంతో టిప్పర్‌ను బస్సుపై నుంచి తొలగించారు. మృతదేహాలను చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ఉన్నట్లు సమాచారం.
News November 3, 2025
బస్సు ప్రమాదం.. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు

TG: మీర్జాగూడ <<18183773>>ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా ఆమె భర్తకు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో వారి ముగ్గురు పిల్లలు అదృష్టవశాత్తు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఓవైపు తల్లి మరణం, మరోవైపు ఆసుపత్రిలో తండ్రి ఉండటంతో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆ చిన్నారులు ఉండిపోయారు. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
News November 3, 2025
ASF: అనధికారంగా వైన్స్ వేలం..!

ఆసిఫాబాద్ జిల్లాలో 5 రోజుల క్రితం మద్యం దుకాణాల టెండర్లు పూర్తయ్యాయి. దుకాణాలు పొందిన వారికి అదృష్టం వరించిందని అందరు అనుకున్నారు. అయితే నిజమే వారికి అదృష్టం వరించింది. అధికారిక టెండర్లు పూర్తవ్వగానే ఇప్పడు అనధికారంగా వేలం పాటలు నడుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టెండర్లలో దుకాణాలు దక్కించుకున్న వారు ఆ దుకాణాలను రూ.కోట్లలో విక్రయించడానికి చూస్తున్నారు. అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.


