News February 28, 2025

వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

image

సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీసీ ఘోష్ ఈరోజు సతీసమేతంగా వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పూజారులు న్యాయమూర్తికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలను న్యాయమూర్తికి అందజేసి ఆశీర్వచనాలు చేశారు. న్యాయమూర్తి వెంట మట్టేవాడ ఇన్‌స్పెక్టర్ గోపి ఉన్నారు.

Similar News

News March 15, 2025

అధికారులతో సమావేశం నిర్వహించిన మేయర్, కమిషనర్

image

బడ్జెట్ సమీక్షపై అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే సమావేశం నిర్వహించారు. 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బల్దియా బడ్జెట్ రూపకల్పనపై సమర్పించిన అంచనాలు సమీక్షించి అధికారులకు మేయర్, కమిషనర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

News March 15, 2025

సూపర్ ప్లాన్: ఈ రీఛార్జ్‌తో 365 రోజులు..

image

తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉండాలనుకునే యూజర్ల కోసం BSNL మంచి ప్లాన్ అందిస్తోంది. రూ.1,198తో రీఛార్జ్ (రోజుకు రూ.3.28) చేస్తే 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్, 30 ఫ్రీ SMSలతో పాటు నెలకు 3GB డేటా వస్తుంది. దేశమంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ పొందొచ్చు. BSNLను సెకండ్ సిమ్‌గా ఉపయోగించేవారికి ఇది బెస్ట్ ప్లాన్.

News March 15, 2025

SKLM: ‘స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలు అమలు చేయాలి’

image

స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా ఇన్ ఛార్జ్ అధికారి శశిభూషణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జేసీ ఫర్మాన్ అహ్మద్‌లతో కలిసి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా ఇన్‌ఛార్జి అధికారి శశిభూషణ్ కుమార్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా వివరాలను తెలియజేశారు.

error: Content is protected !!