News May 25, 2024

వరంగల్: భద్రకాళి చెరువుతో పొంచి ఉన్న ప్రమాదం

image

WGL- HNK ప్రాంతాల మధ్య భద్రకాళి చెరువు ఉంది. 15 ఏళ్లుగా వరదతో పది కాలనీలు నీట మునుగుతున్నాయి. స్మార్ట్‌ సిటీ పథకం ద్వారా భద్రకాళి బండ్‌ పనులు మూడేళ్లుగా సాగుతున్నాయి. దీంతో చెరువు కట్ట బలహీనమైంది. గతేడాది పోతననగర్‌ వైపు మట్టి కట్టకు గండి పడింది. ఇరిగేషన్, గ్రేటర్‌ WGL అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే పలు ప్రాంతాలు నీట మునిగే అవకాశాలున్నాయని స్థానికులు వాపోతున్నారు.

Similar News

News November 27, 2025

వరంగల్: కొత్త విత్తన బిల్లుపై అభిప్రాయాలు సేకరించిన కలెక్టర్

image

కొత్త విత్తన బిల్లు-2025 ముసాయిదాపై రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారుల అభిప్రాయాలను సేకరించామని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఈరోజు వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశంలో బిల్లులోని సెక్షన్లు, క్లాజులపై విస్తృతంగా చర్చించారు. హాజరైన వాటాదారులు ప్రతి అంశంపై తమ సూచనలు తెలియజేశారు. వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

News November 27, 2025

Te-Poll యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: వరంగల్ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పూర్తి సమాచారాన్ని వేగంగా, సులభంగా అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్‌ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్ నమోదు స్థితి వంటి కీలక సమాచారాన్ని ఒకే యాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాప్ ఇది అని పేర్కొన్నారు.

News November 27, 2025

వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ సమీక్ష

image

వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను మరింత పటిష్ఠంగా సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్, జిల్లా పరిశీలకురాలు బి.బాల మాయదేవి (IAS) వరంగల్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమొక్క అందించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.