News March 21, 2025
వరంగల్: భద్రకాళి చెరువు పనులను పరిశీలించిన మంత్రి

భద్రకాళి చెరువు పూడికతీత పనులను దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పూడికతీత మట్టి తరలింపు ప్రక్రియను అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, కెఆర్ నాగరాజు, గుండు సుధారాణి కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావిణ్య, కమిషనర్ అశ్విని తానాజీ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 22, 2025
వరంగల్ జిల్లాలో తగ్గుతున్న భూగర్భ జలాలు

వరంగల్ జిల్లాలో వేసవి దృష్ట్యా భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటి పోతున్నాయి. గతేడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది మరింత లోతుకు పడిపోయాయి. జిల్లాలో దుగ్గొండి, ఖానాపురం, ఖిలా వరంగల్ మినహా మిగతా 10 మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపు చేసుకునేందుకు ఇళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలను తవ్వడం, నీటి వృథాను అరికట్టడం వంటి చర్యలు ఉత్తమ మార్గం.
News March 22, 2025
తొర్రూర్లో బాలికకు అబార్షన్!

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మైనర్ బాలికకు గర్భస్రావం చేసిన ఘటన తొర్రూరులో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాలు.. దంతాలపల్లి మం.కి చెందిన ఓ బాలిక గర్భం దాల్చడంతో ఆస్పత్రికి తీసుకురాగా అబార్షన్ చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న చైల్డ్ లైన్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితుడిపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
News March 22, 2025
ఖానాపూర్: పాకాల వాగు సమీపంలో ముసలి ప్రత్యక్షం

గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఉన్న పాకాల వాగు వద్ద మొసలి కలకలం రేపింది. ఎండలు తీవ్రంగా ఉండటంతో చెరువులు, వాగులు, కుంటలల్లో చుక్క నీరు లేకుండా పోయింది. దీంతో శుక్రవారం రాత్రి పాకాల వాగు వద్ద మొసలి రోడ్డు పైనుంచి దాటుతుండంతో గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో ఈ దారిగుండా వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు తెలుపుతున్నారు.