News February 16, 2025
వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 8, 2025
వివేకా హత్య కేసు.. ఇద్దరు పోలీసులపై కేసులు నమోదు

AP: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై కేసులు నమోదయ్యాయి. రాజుపాలెం పీఎస్ ఏఎస్సై రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వివేకా హత్య వ్యవహారంలో గతంలో వీరు తప్పుడు కేసులు నమోదు చేశారని పులివెందులకు చెందిన కుళాయప్ప అనే వ్యక్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
News November 8, 2025
తాజా సినీ ముచ్చట్లు!

✏ హీరో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా నుంచి రిలీజైన ‘చికిరి చికిరి’ లిరికల్ సాంగ్కు 24 గంటల్లో 46మిలియన్ల వ్యూస్ వచ్చాయి. IND సినిమాలో ఒక్కరోజులో అత్యధిక వీక్షణలు సాధించిన సాంగ్ ఇదే.
✏ మహేశ్- రాజమౌళి మూవీ మేకర్స్ ఈనెల 15న జరిగే ‘GlobeTrotter’ ఈవెంట్లో 100ft పొడవు & 130ft వెడల్పుతో భారీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కనీవినీ ఎరుగని రీతిలో 3 ని.ల గ్లింప్స్ వీడియో ప్రదర్శిస్తారని టాక్.
News November 8, 2025
జూబ్లీహిల్స్: 3 రోజులు సెలవులు.. 2 రోజులు 144 సెక్షన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ రోజు 11న నియోజకవర్గంలోని Govt, Pvt ఆఫీసులు, స్కూళ్లకు సెలవు ఉంటుంది. 10న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన స్కూళ్లలకు సెలవు ప్రకటించారు. 14న కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు ఉంటుందని కలెక్టర్ హరిచందన ప్రకటించారు. అలాగే 10న సా.6 గం. నుంచి 11న సా.6 వరకు, 14న ఉ.6 గం. నుంచి 15న ఉ.6 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ సజ్జనార్ తెలిపారు.


