News February 16, 2025
వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 24, 2025
కృష్ణాజిల్లాలో పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతం

కృష్ణాజిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈఓ పీవీజే రామారావు తెలిపారు. జిల్లాలో 21,771 మంది విద్యార్థులకు గాను 21,419 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు. విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.
News March 24, 2025
బాపట్ల: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు

భార్యను చంపిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించిందని బాపట్ల ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. చినగంజాం గ్రామానికి చెందిన కత్తి శ్రీను అనే వ్యక్తి అతని భార్యను కత్తితో దాడి చేసి హత్య చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. దర్యాప్తులో భాగంగా సోమవారం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి జీవిత ఖైదీ శిక్ష విధించినట్లు తెలిపారు.
News March 24, 2025
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు: ఏసర్ ఇండియా

తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో ఓ పెయిడ్ లీవ్ ఇవ్వనున్నట్లు ఏసర్ ఇండియా వెల్లడించింది. మాతృక పేరిట ప్రతి నెలా ఈ సెలవును అందిస్తామని తెలిపింది. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. L&T, స్విగ్గీ, జొమాటో కూడా ఈ తరహా లీవ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. బిహార్, ఒడిశా, సిక్కిం, కేరళ ప్రభుత్వాలు సైతం ఈ సెలవును అమలు చేస్తున్నాయి.