News February 16, 2025

వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

image

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 14, 2025

LRSపై నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్

image

మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఎల్ఆర్ఎస్ పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ మాధురి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ రోజువారి పరిష్కారం నివేదికలు పంపించాలని చెప్పారు. దీనిపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 31లోగా డబ్బులు చెల్లిస్తే 25% రాయితీ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News March 14, 2025

సిద్దిపేట: WOW.. గ్రూప్స్‌లో సత్తా చాటిన బ్రదర్స్

image

బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సీత లక్ష్మి, కొమురయ్య దంపతులకు చెందిన కొడుకులు వెంకటేశ్, హరికృష్ణలు ఇటీవల విడుదలైన గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. పెద్ద కుమారుడు వెంకటేష్ గ్రూప్ -1లో 466 మార్కులు సాధించారు. ర్యాంక్స్ వెల్లడించాల్సి ఉండగా ప్రస్తుతం వెంకటేష్ పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ జెన్కో ఏఈగా పనిచేస్తున్నాడు. చిన్నాడో హరికృష్ణ గ్రూప్‌-2లో 184 ర్యాంక్ సాధించారు.

News March 14, 2025

NGKL: అత్తమామల సాకారంతో GOVT ఉద్యోగం.!

image

కోడేరు మండలానికి చెందిన ఫౌజియాకు జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించింది. హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన కొలువుల పండుగలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాన్ని ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అత్త, మామ, భర్త సాకారంతో ఈ ఉద్యోగం సాధించానని, వారి సహకారం మరువలేనని తెలిపారు.

error: Content is protected !!