News February 16, 2025
వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 22, 2025
అనకాపల్లి: క్వారీలో గాయపడిన కార్మికుడి మృతి

అనకాపల్లి మండలం కుంచంగి క్వారీలో శుక్రవారం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడిన కార్మికుడు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. మృతి చెందిన కార్మికుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన జానీగా పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
News March 22, 2025
స్కూళ్లకు ఇవాళ సెలవు ఇవ్వాలని వినతి

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలి రోడ్లపై పడ్డాయి. <<15840994>>ఇవాళ<<>> కూడా బలమైన గాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో స్కూళ్లకు సెలవు ఇవ్వాలని పేరెంట్స్ కోరుతున్నారు. గాలివానలో పిల్లలను పాఠశాలలకు పంపడంపై ఆందోళన చెందుతున్నారు. దీనిపై మీరేమంటారు?
News March 22, 2025
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నిందితుల అరెస్ట్

హిందూపురం 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి, నిర్వాహకులు మంజుల, కానిస్టేబుల్ పురుషోత్తంను అరెస్ట్ చేసినట్లు సీఐ అబ్దుల్ కరీం తెలిపారు. టూటౌన్ స్టేషన్‌లో గతంలో పనిచేసిన కానిస్టేబుల్ సహకారంతో మోడల్ కాలనీలో మంజుల వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. సమాచారం మేరకు దాడులు నిర్వహించగా.. ఈశ్వర్ అనే వ్యక్తి పారిపోయాడు. మంజుల, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.