News July 25, 2024
వరంగల్: భారీగా తగ్గిన మిర్చి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి బుధవారం క్వింటాకు రూ.17,200 పలకగా.. నేడు రూ.18,000కి పెరిగింది. అలాగే 341 రకం మిర్చి నిన్నటి లాగే నేడు కూడా రూ.13,300 పలికింది. ఐతే వండర్ హాట్ (WH) మిర్చి మాత్రం భారీగా తగ్గింది. నిన్న రూ.16,000 వచ్చిన ధర.. ఈరోజు రూ.13,500కి పతనమైంది.
Similar News
News November 20, 2025
సీఎం సహాయనిది పేదలకు ఒక వరం: ఎంపీ కావ్య

అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహాయనిది ఒక వరమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఎంపీ CMRF చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 11 మందికి రూ.6 లక్షల 25 వేల విలువైన చెక్కులను అందజేశారు.
News November 19, 2025
వరంగల్ కలెక్టర్కు మంత్రి పొంగులేటి అభినందనలు

జల సంరక్షణ కేటగిరీ-2లో వరంగల్ జిల్లా అవార్డు సాధించి, ఢిల్లీలో అవార్డు స్వీకరించిన నేపథ్యంలో, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి ఐఏఎస్ను ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ మంత్రితో కాసేపు చర్చించారు.
News November 19, 2025
పారదర్శకంగా ఇందిరమ్మ చీరల పంపిణీ

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. వీడియో కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడుతూ పంపిణీని పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9లోగా, పట్టణాల్లో మార్చి 1-8 మధ్య పంపిణీ పూర్తి చేయాలని సీఎం సూచించారు.


