News March 20, 2025

వరంగల్: భారీగా తగ్గిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు భారీగా తగ్గాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.13,100 ధర రాగా.. నేడు రూ.12,700 పలికింది. 341 రకం మిర్చికి నిన్న రూ.12,800 ధర రాగా ఈరోజు రూ. 13,000 అయింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి క్వింటా బుధవారం రూ.16వేలు ధర పలకగా ఈరోజు రూ.15,500కి పతనమైనట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News December 19, 2025

బీఆర్ నగర్‌ అంగన్వాడీ కేంద్రంలో మంత్రి ఆకస్మిక తనిఖీ

image

బీఆర్ నగర్‌లోని అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందుతున్న పోషకాహారం, పిల్లల హాజరు, శుభ్రత, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను మంత్రి నిశితంగా పరిశీలించారు. పిల్లలకు అందించే ఆహార నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సమర్థవంతంగా అమలవ్వాలని ఆదేశించారు.

News December 19, 2025

వరంగల్ జిల్లాలో యూరియా నో స్టాక్..!

image

రైతులు యూరియా కొనుగోలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ను తీసుకొని వచ్చింది. తమకు కావలసిన యూరియా బస్తాలను యాప్ ద్వారా బుక్ చేసుకుంటే రైతులకు దగ్గరలో ఉన్న డీలర్ వద్ద నుంచి బస్తాలు తీసుకెళ్లవచ్చని అధికారులు సూచించారు. దీంతో యాప్‌లో యూరియా బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతుంది. వరంగల్ జిల్లాలో యూరియా స్టాక్ లేదని యాప్‌లో చూపిస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News December 19, 2025

వరంగల్: యూరియా యాప్ విధానంపై రైతుల ఆవేదన

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి యూరియా కోసం మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానం తెలియని, స్మార్ట్ ఫోన్ లేని వారు ఎక్కువగా ఉండటంతో ఈ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాప్‌కు ప్రత్యామ్నాయంగా ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా కొనసాగించాలని వారు కోరుతున్నారు.