News December 3, 2024

వరంగల్: భారీగా పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం తేజ మిర్చి క్వింటాకు రూ.15,000 ధర రాగా నేడు రూ.15,300కి పెరిగింది. అలాగే కొత్త తేజా మిర్చికి నిన్నటిలాగే రూ.14,500 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు. మరోవైపు 341 రకం మిర్చి నిన్న రూ.13,500 పలకగా, నేడు రూ.14,500 అయింది. వండర్ హాట్(WH) మిర్చికి సోమవారం రూ.11,000 ధర రాగా నేడు రూ.14వేలు వచ్చిందన్నారు.

Similar News

News February 11, 2026

వర్ధన్నపేట: ఓటర్లను ఆకట్టుకునేలా..!

image

వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేలా అధికారులు హరిత పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఫిరంగిగడ్డ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో అధికారుల బృందం ఏర్పాటు చేయించిన హరిత పోలింగ్ కేంద్రం విశేషంగా ఆకర్షిస్తోంది. హరిత పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేశారు. హరిత పోలింగ్ కేంద్రంపై ప్రజాస్వామ్యం-ఓటు హక్కు విలువలను తెలుపుతూ నినాదాలు రాయించారు.

News February 9, 2026

పీఎంశ్రీ పాఠశాలలపై వరంగల్ కలెక్టర్ సమీక్ష

image

పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన విద్యాలయాల పనితీరుపై వరంగల్ కలెక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 16 పాఠశాలలు ఈ పథకం కింద కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమాలు, నిర్వహణ తీరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ పాఠశాలల్లో విజ్ఞాన విహార యాత్రలు, యోగా శిక్షణ తరగతులు, సైన్స్ ఫెయిర్‌లు తదితర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.

News February 9, 2026

వరంగల్: ‘ఈనెల 11న వేతనంతో కూడిన సెలవు’

image

ఈనెల 11న పోలింగ్ నేపథ్యంలో వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో వేతనంతో కూడిన సెలవు కల్పిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించినట్లు ఆమె వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ భవనాల విద్యా సంస్థలకు ఈనెల 10, 11వ తేదీల్లో, 13వ తేదీ ఓట్ల లెక్కింపు రోజు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.