News July 16, 2024

వరంగల్: భారీగా పెరిగిన 341 రకం మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌‌లో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి.
ఏసీ తేజ మిర్చి సోమవారం క్వింటాకు రూ.17,700 పలకగా.. నేడు రూ.17,100 పలికింది.
అలాగే 341 రకం మిర్చికి సోమవారం రూ.14,000 ధర రాగా నేడు రూ.16,500 ధర వచ్చింది.
వండర్ హాట్(WH) మిర్చి నిన్న రూ.14,500 ధర రాగా.. నేడు రూ.15,500కి పెరిగింది.

Similar News

News October 2, 2024

వరంగల్: మరికాసేపట్లో DSC సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

వరంగల్ జిల్లాలో DSCలో SGT అభ్యర్థులు 1 :3నిష్పత్తిలో 435 మంది, SGT ఉర్దూలో 25 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అర్హత సాధించారని డీఈఓ జ్ఞానేశ్వర్ తెలిపారు. బుధవారం ఉ.10 గంటల నుంచి సా. 5 గంటల వరకు GTలో 270 మంది, SGT ఉర్దూలో 25 మంది అభ్యర్థులు వెరిఫికేషన్‌కు రావాలన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో, రెండు సెట్లు గెజిటెడ్ తప్పనిసరన్నారు. వివరాలకు www.deowarangal.net సంప్రదించాలన్నారు.

News October 2, 2024

గీసుగొండ: బాలికపై వృద్ధుడి అత్యాచారం

image

గీసుగొండలో దారుణం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన 12ఏళ్ల బాలికపై సాంబయ్య (65) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి చనిపోగా అన్నదమ్ములతో కలిసి ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్యులు పరీక్షించి 4నెలల గర్భవతిగా నిర్ధారించారు. సాంబయ్యపై పోక్సో చేసు నమోదైంది.

News October 2, 2024

WGL: నేడు ఎంగిలిపూల బతుకమ్మ

image

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ప్రకృతితో మమేకమయ్యే సంబరం బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజులపాటు తొమ్మిది రకాల ప్రసాదాలను బతుకమ్మకు నివేదిస్తారు. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ అలంకరణ చేస్తారు. దీనికోసం రకరకాల పువ్వులు తీసుకొచ్చే బతుకమ్మగా పేరుస్తారు. ఈరోజు నువ్వులు, నూకలు లేదా బియ్యం, బెల్లంతో నైవేద్యం చేసి బతుకమ్మకు సమర్పిస్తారు.